Header Banner

పదో తరగతి, ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు.. మాస్ కాపీలకు చెక్‌! కలెక్టర్ కీలక ఆదేశాలు!

  Fri Feb 14, 2025 23:25        Education

రానున్న పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరీక్షలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, సమస్యాత్మక పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, 144 సెక్షన్‌ అమలు చేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రానికి కిలోమీటరు పరిధిలో ఇంటర్‌నెట్‌, జెరాక్స్‌ సెంటర్‌లను మూసి వేయించాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లోకి అభ్యర్థులు, ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బంది ఎలకా్ట్రనిక్‌ పరికరాలు తీసుకువెళ్లరాదన్నారు.


ఇది కూడా చదవండి: ఎంతగానో ఎదురు చూస్తున్న శుభవార్త! వల్లభనేని వంశీ హైదరాబాద్ లో అరెస్టు! పండుగ చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు! 


పోలీసులు ముందుగా తనిఖీ చేయాలని ఆదేశించారు. ఎక్కడా మాస్‌ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు సకాలంలో చేరాలన్నారు. సమయం మించిన తరువాత వచ్చే అభ్యర్థులను అనుమతించవద్దన్నారు. జిల్లాలో పదో తరగతి పరీక్షలను 11,766 మంది రెగ్యులర్‌ విద్యార్థులు, ఓపెన్‌ స్కూల్‌ ద్వారా 1,297 మంది హాజరవుతున్నారన్నారు. మార్చి 17 నుంచి 31వ తేదీ వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ఇందుకోసం 71 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహిస్తున్నామన్నారు. వీటిలో 18 కేంద్రాలలో ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలు జరుగుతాయన్నారు. ఇంటర్‌ మొదటి సంవత్సర పరీక్షలకు 6,518, ఓపెన్‌ పరీక్షలకు 1,545 మంది, రెండో సంవత్సర పరీక్షలకు 5,335 మంది, ఒకేషనల్‌ పరీక్షలకు 1,322 మంది హాజరు కానున్నారన్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


ఇంటర్‌ పరీక్షలు మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయన్నారు. పరీక్ష కేంద్రాలలో తాగునీరు, మరుగుదొడ్లు, లైట్లు, ఫ్యాన్‌లు ఉండేలా అధికారులు చూసుకోవాలన్నారు. డీఈవో, ఇంటర్మీడియట్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేయాలన్నారు. బంద్‌ కారణంగా ఈనెల 11వ తేదీన వాయిదా వేసిన ప్రాక్టికల్‌ పరీక్షను ఫిబ్రవరి 20వ తేదీన నిర్వహించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. ఈ సమావేశంలో డీఆర్‌వో పద్మలత, డీఈవో బ్రహ్మాజీరావు, టీడబ్ల్యూ డీడీ ఎల్‌.రజని, డీఐఈవో కె.అప్పలరాము, సహాయ కమిషనర్‌(పరీక్షలు) శశికుమార్‌, డీపీవో లవరాజు, డీఎల్‌పీవో పీఎస్‌.కుమార్‌, ఈపీడీసీఎల్‌ ఈఈ అప్పారావు, ఆర్టీసీ డీఎం టి.ఉమామహేశ్వరరెడ్డి, సీఐ డి.దీనబందు, వైద్య ఆరోగ్య శాఖ, తపాలా శాఖ, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మరో నామినేటెడ్ పోస్టుపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ! ఆ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గా ఆయన నియామకం!

 

మార్కెట్‌లోకి కొత్త 50 రూపాయల నోటు.. RBI కీలక ప్రకటన.! మరి పాత నోట్ల పరిస్థితి.?

 

వైసీపీకి భారీ షాక్.. ఆ జిల్లాలో కీలక పరిణామం.. టీడీపీలో చేరిన వైసీపీ నేత! 20 కుటుంబాలు ఈరోజు..

 

ఈసారి Valentines Dayకి మీ గర్ల్ ఫ్రెండ్ ని విమానం లో తీసుకువెళ్లండి.. భారీగా డిస్కౌంట్ ఇస్తున్న ఇండిగో! త్వరగా బుకింగ్ చేసుకోండి!

 

ఏపీ మహిళలకు శుభవార్త.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! కొత్త నిర్ణయాలను అమల్లోకి.. ఈ రంగాల్లో వారికి..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #tenth #intermediate #exams #strictrule #CCTVmonitoring #todaynews #flashnews #latestupdate